శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : సోమవారం, 6 జనవరి 2020 (17:00 IST)

పెళ్లి చేసుకుందాం రమ్మన్నాడు... డబ్బుతో పారిపోయాడు

ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు… వివాహం చేసుకుంటానని పెళ్లి కోసం ఫంక్షన్ హాల్ బుక్ చేశానన్నాడు. పెళ్లి రోజున ఫంక్షన్ హాల్‌కు వెళ్తే ప్రేమికుడు లేడు పంక్షన్ హాల్ లాక్ చేసి ఉంది. పెళ్లి కుమారుడికి ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ అని రావడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో లవర్ ఫిర్యాదు చేసిన సంఘటన హైదరాబాద్‌లో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… హైదరాబాద్‌లోని మసాబ్ ట్యాంక్ ప్రాంతం శాంతి నగర్‌లో ఉండే ప్రవీణ్ అనే యువకుడి ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నానిన వెంటపడ్డాడు. దీంతో అమ్మాయి ప్రవీణ్ ప్రేమించింది. బేగంపేటలోని ప్రైవేట్ ఫైర్మ్ కంపెనీలో పని చేస్తున్నానని ప్రేమికుడు చెప్పాడు.

పెళ్లి కోసమని ఫంక్షన్ హాల్ బుక్ చేశానని ప్రియురాలు వద్ద పలుమార్లు డబ్బులు కూడా తీసుకున్నాడు. పెళ్లి రోజు త్వరగా ఫంక్షన్ హాల్ రావాలని సూచించాడు. దీంతో ఆమె తన తల్లిదండ్రులతో కలిసి హాల్‌కు వెళ్లింది. ఫంక్షన్ హాల్ గేట్ లాక్ చేసింది. ఫంక్షన్ లోపలికి వెళ్లి విచారించగా హాల్ బుక్ చేయలేదని తెలిసింది.

వెంటనే ఆమె ప్రవీణ్‌కు ఆమె ఫోన్ చేసింది. ఫోన్ స్విచ్ఛాప్ రావడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి ప్రవీణ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.