శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శనివారం, 4 జనవరి 2020 (17:12 IST)

మూడేళ్లకే ఓటు హక్కు

తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా అధికారులు విడుదల చేసిన ఓటరు ముసాయిదా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అర్హతున్న వారికి ఓటుహక్కు ఇవ్వని అధికారులు, కరీంనగర్‌ నగరపాలకసంస్థ పరిధిలోని ఓ మూడేళ్ల చిన్నారిని ఓటరు ముసాయిదాలో చేర్చారు.

కరీంనగర్‌లో ఓటర్‌ ఐడీ వైఓజే 8588352 నంబర్‌పై నందిత మెతుకు పేరిట నమోదు అయింది.
నందిత వయస్సు 35ఏళ్లుగా, ఇంటినంబర్‌ 5–6–434గా ప్రచురించారు. వీటిని చూసిన నందిత తండ్రి మెతుకు రమేశ్‌ అవాక్కయ్యాడు.

తమకూతురు నందిత వయస్సు 3ఏళ్లని, ఎల్‌కేజీ చదువుతోందని తెలిపాడు. అధికారులు స్పందించి వెంటనే ఓటర్‌ లిస్ట్‌ నుంచి తమ కూతురుపేరు తొలగించాలని కోరాడు.