శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం

ఆ ఏనుగు ఐదేళ్లలో 50 మందిని చంపేసింది

అసోంలో ఓ ఏనుగు బీభత్సం సృష్టిస్తోంది. ఐదేళ్ల నుంచి అది మనుషులే టార్గెట్ గా మారణ హోమం సృష్టిస్తోంది. గత ఐదేళ్లలో ఇప్పటి వరకూ 50 మందిని చంపేసింది.

లాడెన్ అనే ఆ ఏనుగు తాజాగా కోయిన కోచి ఫారెస్టు డివిజన్ పరిధిలో చిన్నారి సహా ముగ్గురు మహిళలను చంపేసింది. హఠాత్తుగా దాడి చేసి దొరికిన వారిని దొరికినట్లు కాళ్లతో తొక్కి చంపేస్తున్నదని ఫారెస్టు అధికారులు చెప్పారు.

మంద నుంచి విడివడిన ఆ ఏనుగు ఇలా జనావాసాలపై దాడి చేస్తున్నదని తెలిపారు. ఆ ఏనుగును ఫారెస్టు అధికారులు ‘రోగ్’గా అభివర్ణించారు. ఆ ఏనుగును బంధించేందుకు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు.