శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శుక్రవారం, 4 అక్టోబరు 2019 (17:53 IST)

తండ్రిపై పోలీసులకు ఎనిమిదేళ్ల బాలుడు ఫిర్యాదు

కన్నతండ్రి పైనే ఎనిమిదేళ్ల బాలుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తండ్రి కొడుతున్నాడని, వేధింపులకు గురిచేస్తున్నాడంటూ... ఆ బాలుడు ఏకంగా పోలీసులను ఆశ్రయించాడు. అసలేం జరిగిందంటే...?

ఎనిమిదేళ్ల బాలుడు తన తండ్రి నిత్యం అకారణంగా కొడుతూ, తిడుతూ వేధింపులకు గురి చేస్తున్నాడని పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన గురువారం నిజామాబాద్‌ జిల్లాలో వర్ని మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.

బాలుడి కుటుంబ సభ్యులను ఠాణాకు పిలిపించిన ఎస్సై కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఇక నుంచి ఎలాంటి ఇబ్బందుల్లేకుండా, బాధపెట్టకుండా చూసుకుంటామని తండ్రి చెప్పడంతో వదిలిపెట్టారు. అనంతరం బాలుడిని కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకెళ్లారు.