గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం

మన్యంలో పోలీసుల తనిఖీలు.. అదుపులో అనుమానితులు

సెప్టెంబర్ 23న గుమ్మి రేవుల ఎన్​కౌంటర్​కు నిరసనగా నేడు విశాఖ మన్యంలో బంద్ చేపడుతున్నట్లుగా.. మావోయిస్టులు బంద్​కు పిలుపునివ్వడంపై పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేశారు.

అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. విశాఖ మన్యం జి.మాడుగుల మండలంలోని పలు గ్రామాల్లో మావోయిస్టులు పోస్టర్లు అతికించడంపై పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేశారు. మద్దిగరువు, బొయితలి, సూరి మెట్ట ప్రాంతాల్లో సోదాలు చేశారు.

సెప్టెంబర్ 23న గుమ్మి రేవుల ఎన్​కౌంటర్​లో మృతిచెందిన ఐదుగురు మావోయిస్టుల పేర్లు గోడ పత్రికలో రాసి జోహార్లు అర్పించడమే కాక.. మావోయిస్టులు బంద్​కు పిలుపు ఇవ్వడంపై ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.