శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 12 సెప్టెంబరు 2019 (08:54 IST)

పోలీసుల అదుపులో గుప్తనిధుల వేటగాళ్లు

అనంతపురం జిల్లా అగళి మండల కేంద్రంలోని శంకరేశ్వర స్వామి దేవాలయంలో  గుప్త నిధుల కోసం ఆరు మంది గుర్తు తెలియని వ్యక్తులు తవ్వ కాలు చేపట్టారు. రాత్రి వేళల్లో గస్తీ నిర్వహి స్తున్న ఏఎస్‌ఐ రాజ్‌కు మార్‌, కానిస్టేబుల్‌ మహ్మద్‌రఫిలు గమనించి వెంబడించి మహేష్‌ అనే వ్యక్తిను అదుపులోకి తీసుకు న్నారు. మిగతా ఐదుగురు పరారయ్యారు.

వీరు బెంగుళూరులోని నెలమంగళ, దొడ్డబ ళ్లాపూర్‌ ప్రాంతాలకు చెందినవారిగా గుర్తిం చారు. మధూడి గ్రామానికి చెందిన సంతోష్‌ అనే వ్యక్తి సహకారంతో వారిని పట్టుకున్నారు. గతంలో గుప్త నిధుల కోసం రెండు మార్లు తవ్వకాలు చేపట్టి విఫలమైనట్లు తెలిసింది. పరారైన వారి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు ఏఎస్‌ఐ తెలిపారు.

గుప్త నిధుల కోసం ఉప యోగించిన పరికరాలను స్వాధీనంచేసు కున్నారు. మహేష్‌ను అనంతపురం జిల్లా కేంద్రంలోని క్రైం పోలీసు స్టేషన్‌కు తరలించారు.