సంబంధిత వార్తలు
- నెల్లూరులో సినిమాకెళ్లారు... భార్య టాయిలెట్కెళ్లి తిరిగి రాలేదు...
- కడుపునొప్పి అని ఆస్పత్రికి వెళ్తే.. కత్తెర పెట్టి కుట్టేశారు..
- జగన్ సీఎం కావాలి... ప్రత్యేక రొట్టెను అందుకున్న అనిల్ కుమార్ యాదవ్
- నాకేం కాలేదు.. ఆరోగ్యంగానే ఉన్నా.. మహానటిలో నటిస్తున్నా: షాలినీ పాండే (వీడియో)
- సింగిల్ చపాతీ తినే చంద్రబాబుకు పాంట్రీకారు అవసరమా?: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
నెల్లూరులో మనుషులను పోలిన పక్షులు (వీడియో)
ఆంధ్ర రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లోని సూళ్లూరుపేట పరిసర ప్రాంత వాసులంతా ప్రతి ఏటా విదేశాల నుండి విడిదికి వచ్చే రకరకాల జాతుల పక్షులను చూస్తుంటారు. అయితే గత మూడురోజులుగా ఆ ప్రాంతంలోని కొన్ని పక్షులను చూసి ఈ ప్రాంత
ఆంధ్ర రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లోని సూళ్లూరుపేట పరిసర ప్రాంత వాసులంతా ప్రతి ఏటా విదేశాల నుండి విడిదికి వచ్చే రకరకాల జాతుల పక్షులను చూస్తుంటారు. అయితే గత మూడురోజులుగా ఆ ప్రాంతంలోని కొన్ని పక్షులను చూసి ఈ ప్రాంత వాసులు ఆశ్చర్య పోతున్నారు. పక్షుల్లోనే కొత్త జాతిగా కనిపించడమే కాకుండా గద్ద పోలికలు ఉండడంతో పర్యాటకులు ఎంతో ఆశ్చర్యంగా తిలకిస్తున్నారు.
మొదట్లో రెండు పక్షులు మాత్రమే కనిపించగా ఇప్పుడు పదుల సంఖ్యలో ఇలాంటి పక్షులే ఎక్కువగా ఈ ప్రాంతంలో కనిపిస్తున్నాయి. తెల్ల రంగు గుడ్లగూబ మూతిని పోలి ఉన్న ఈ రెండు తెల్లటి పక్షులు ఏ జాతికి చెందినవో ఎవరూ గుర్తించలేకపోతున్నారు.
వెరైటీ శబ్దంతో పక్షులు సూళ్ళూరుపేట పరిసర ప్రాంతంలో తిరుగుతున్నాయి. వాటిని తరిమి కొట్టినా అక్కడి నుంచి అస్సలు కదలడం లేదు... మెదలడం లేదు. ఎవరికీ అస్సలు భయపడటం లేదు. ఈ పక్షుల విషయం నేషనల్ జియో ఛానల్ వారికి తెలిసింది. విదేశాల నుంచి ఈ పక్షుల షూటింగ్ కోసం వారు మరో రెండు రోజుల్లో సూళ్లూరుపేటకు రానున్నారు.
