శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 31 అక్టోబరు 2017 (15:06 IST)

కడుపునొప్పి అని ఆస్పత్రికి వెళ్తే.. కత్తెర పెట్టి కుట్టేశారు..

కడుపునొప్పి భరించలేక ఓ రోగి ఆస్పత్రికి వెళ్తే.. అక్కడ పొట్టలో కత్తెర వుందనే విషయం బయటపడింది. ఈ ఘటన నెల్లూరు జిల్లాలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో సోమవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. నెల్

కడుపునొప్పి భరించలేక ఓ రోగి ఆస్పత్రికి వెళ్తే.. అక్కడ పొట్టలో కత్తెర వుందనే విషయం బయటపడింది. ఈ ఘటన నెల్లూరు జిల్లాలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో సోమవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. నెల్లూరు గ్రామీణ మండలం నారాయణరెడ్డిపేటకు చెందిన చలపతి(50) ఈ నెల 2వ తేదీన కడుపునొప్పి భరించలేక జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని వైద్యులను సంప్రదించారు. 
 
వైద్యులు రోగికి శస్త్రచికిత్స చేసి ఇంటికి పంపారు. డిశ్చార్జ్‌ అయినా.. అతనికి కడుపులో ఏమాత్రం నొప్పి తగ్గకపోవడంతో ఈ నెల 27న అదే ఆసుపత్రికి వచ్చి బాధితుడు పరిస్థితి వివరించాడు. ఆపై ఆ వ్యక్తికి నిర్వహించిన పరీక్షల్లో అతని పొట్టలో కత్తెర వున్న విషయాన్ని గుర్తించారు. 
 
ఈ విషయం బయటకు పొక్కనీయకుండా చేయాలనుకున్న ఆస్పత్రి యాజమాన్యానికి ఏమాత్రం వీలుపడలేదు. చివరికి ఈ నెల 28న మళ్ళీ ఆ వ్యక్తికి శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం బాధితుడు కోలుకున్నాడని వైద్యులు తెలిపారు.