బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: మంగళవారం, 10 అక్టోబరు 2017 (11:14 IST)

లైంగిక అవయవాన్ని మార్చేసి నావికుడు నావికురాలైంది... పీకేసిన డిఫెన్స్ వింగ్

ఇండియన్ నేవీలో పనిచేస్తున్న మనీష్ గిరి కాస్తా తన లైంగిక అవయవాన్ని మార్చేసుకోవడంతో పాటు పేరును కూడా సబి అని మార్చేసుకుంది. ట్రాన్స్‌జెండర్‌గా మారడంపై ఇండియన్ నేవీ శాఖ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆమెను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకీ మ

ఇండియన్ నేవీలో పనిచేస్తున్న మనీష్ గిరి కాస్తా తన లైంగిక అవయవాన్ని మార్చేసుకోవడంతో పాటు పేరును కూడా సబి అని మార్చేసుకుంది. ట్రాన్స్‌జెండర్‌గా మారడంపై ఇండియన్ నేవీ శాఖ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆమెను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకీ మనీష్ గిరి మహిళగా ఎందుకు మారాడు...?
 
ఏడేళ్ల క్రితం మనీష్ కుమార్ గిరి విశాఖపట్టణంలోని తూర్పు నావికాదళంలో మెరైన్ ఇంజినీరింగ్ డిపార్టుమెంటులో చేరాడు. కొన్ని నెలల క్రితం శెలవుపై ఢిల్లీకి వెళ్లాడు. అక్కడే తన సెక్స్ అవయవ మార్పిడికి నిర్ణయించుకున్నాడు. 22 రోజుల తర్వాత గిరి కాస్తా సబిగా మారిపోయి యువతిలా తిరిగొచ్చేసరికి అంతా షాకయ్యారు. 
 
విధుల్లోకి వచ్చిన రెండ్రోజులకే ఆమెకు మూత్రనాళ సమస్య తలెత్తింది. మరోవైపు తన అవయవ మార్పిడి చేసుకున్నట్లు గ్రహించి విషయాన్ని పైఅధికారులకు చేరవేశారు నేవీ సిబ్బంది. దానితో నిబంధనల ప్రకారం పురుషుడిగా విధుల్లో చేరి అంగ మార్పిడికి పాల్పడిన కారణంగా ఆమెను తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. 
 
దీనిపై సబి మండిపడింది. ఒక పురుషుడిగా వున్నప్పుడు తను ఎంతో స్వేచ్చగా ఉద్యోగం చేశాననీ, అలాంటిది కొన్ని పరిస్థితుల వల్ల తను మహిళగా మారితే తనపై వివక్ష చూపుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. తనను విధుల నుంచి తొలగించినంత మాత్రాన చేతులు ముడుచుకుని కూర్చోబోననీ, సుప్రీంకోర్టుకు వెళ్లి న్యాయ పోరాటం చేస్తానంటూ వెల్లడించింది. అంతేకాదు... తన సమస్యను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విన్నవించుకుంటానని కూడా అంటోంది.