సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 10 అక్టోబరు 2017 (06:07 IST)

నీ అందానికి ఫిదా అయిపోయా.... ఒక్కసారి రూమ్‌కి రా..!

మహిళలకు రక్షణ కల్పించాల్సిన ఓ ఖాకీ.. ఓ మహిళను లైంగికంగా వేధించుకుతిన్నాడు. నీ అందానికి ఫిదా అయిపోయా.. ఒక్కసారి రూమ్‌కి రావా అంటూ వేధిస్తూ... రకరకాల వెకిలి చేష్టలతో వేధించాడు. ఈ సంఘటన కృష్ణా జిల్లా నూజ

మహిళలకు రక్షణ కల్పించాల్సిన ఓ ఖాకీ.. ఓ మహిళను లైంగికంగా వేధించుకుతిన్నాడు. నీ అందానికి ఫిదా అయిపోయా.. ఒక్కసారి రూమ్‌కి రావా అంటూ వేధిస్తూ... రకరకాల వెకిలి చేష్టలతో వేధించాడు. ఈ సంఘటన కృష్ణా జిల్లా నూజివీడులో వెలుగుచూసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే... నూజివీడుకు చెందిన ఓ మహిళ స్థానిక ప్రైవేట్‌ స్కూల్లో ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. ఆమె భర్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి. ఆఫీసు ఫైల్‌ పోవడంతో ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో భాగంగా వారి ఇంటికి వచ్చిన ఎస్‌ఐ వెంకట్‌కుమార్‌ ఆ మహిళను చూసి, ఆమె అందానికి ఫిదా అయిపోయాడు. అప్పటి నుంచి ఆమెతో పలుమార్లు ఫోన్‌లో మాట్లాడసాగాడు. 
 
నీ అందం పిచ్చెక్కిస్తోంది. లాడ్జ్‌లో రూమ్‌కు రమ్మంటూ వేధించసాగాడు. వేధింపులు ఆగకపోవడంతో ఆదివారం రాత్రి జిల్లా ఎస్పీకి మొత్తం సమాచారాన్ని ఆమె ఫిర్యాదు రూపంలో పంపింది. దీనిపై స్పందించిన జిల్లా ఎస్పీ.. ఎస్‌ఐ వెంకట్‌కుమార్‌ను తన కార్యాలయానికి రప్పించారు.