శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 9 అక్టోబరు 2017 (13:52 IST)

మూతపడనున్న టాటా టెలీ సర్వీసెస్.. రోడ్డునపడనున్న 5 వేల మంది

గత రెండు దశాబ్దాలుగా సేవలు అందిస్తూవస్తున్న ఫోన్ సర్వీస్ వెంచర్ టాటా టెలీ సర్వీసెస్‌ను టాటా గ్రూపూ మూసివేసింది. నష్టాలను భరించలేక ఈ సంస్థను మూసివేస్తున్నట్టు ప్రకటించింది.

గత రెండు దశాబ్దాలుగా సేవలు అందిస్తూవస్తున్న ఫోన్ సర్వీస్ వెంచర్ టాటా టెలీ సర్వీసెస్‌ను టాటా గ్రూపూ మూసివేసింది. నష్టాలను భరించలేక ఈ సంస్థను మూసివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ నష్టాలతో పాటు వైర్‌లైన్ సేవలకు ప్రాధాన్యత తగ్గిపోవడం, ఫోన్ల సంఖ్య కనిష్టానికి చేరడంతోనే సంస్థను నిర్వహించలేని పరిస్థితుల్లోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంస్థ ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. 
 
ఇక ఈ మూసివేత ప్రక్రియలో భాగంగా 5 వేల మంది ఉద్యోగులు రోడ్డున పడనుండగా, వీరికి మూడు నుంచి ఆరు నెలల నోటీసులు ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఇక తమంతటతాముగా ముందే సంస్థను వీడే వారికి ప్రత్యేక ప్యాకేజీలను కూడా టాటా టెలీ సర్వీసెస్ ఆఫర్ చేస్తోంది. కొంతమంది ఉద్యోగులను ఇతర గ్రూప్ కంపెనీలకు బదిలీ చేస్తున్నారని, పదవీ విరమణకు చేరువుగా ఉన్న వారికి స్వచ్ఛంద పదవీ విరమణ అవకాశాన్ని ఇస్తున్నట్టు సంస్థ ఉన్నతాధికారులు చెపుతున్నారు.