సోమవారం, 7 ఏప్రియల్ 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 7 ఏప్రియల్ 2025 (14:09 IST)

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

VaishnaviChaitanya
ఎవరో చెప్పే మాటలు విని మోసపోవడం కంటే ఓపికతో ప్రయత్నిస్తే మూవీ అవకాశాలు వస్తాయని యంగ్ హీరోయిన్ వైష్ణవి అంటున్నారు. చిత్రపరిశ్రమలో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావు అనే ప్రచారం ఎందుకు జరిగిందో తనకు తెలయదన్నారు. కానీ, ఓపికతో ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా అవకాశాలు వరిస్తాయని ఆమె వెల్లడించారు. 
 
షార్ట్ ఫిల్మ్‌లతో తన కెరీర్‌ను ప్రారంభించిన వైష్ణవి... వెబ్ సిరీస్‍‌లతో పాటు పాపులర్ అయిన అచ్చ తెలుగు అమ్మాయిగా గుర్తింపును సొంతం చేసుకున్నారు. తొలి సినిమా బేబీతో రాత్రికి రాత్రే స్టార్ అయిపోయింది. ప్రస్తుతం హీరో సిద్ధూ జొన్నలగడ్డ సరసన జాక్ మూవీలో నటిస్తోంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో వైష్ణవి చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇపుడు వైరల్ అవుతున్నాయి. 
 
తెలుగు అమ్మాయిలకు సినిమాల్లో అవకాశాలు రావనే ప్రచారంతోనే చాలామంది అమ్మాయిలు ఇండస్ట్రీకి రావాలనే ఆలోచన చేయడం లేదన్నారు. ఇండస్ట్రీలోకి రావాలనే ప్రయత్నమే చేయకపోతే ఎలాగని ప్రశ్నించింది. ఓపికతో ప్రయత్నిస్తే అవకాశాలు వస్తాయని, దానికి తానే ఓ మంచి ఉదాహరణ అని చెప్పారు. అకాశాలు రావు అని భయపడి రావాలనుకునేవారికి ఇదే తానిచ్చే మంచి సలహా అని ఆమె చెప్పారు.