ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 9 అక్టోబరు 2017 (16:38 IST)

ధోనీ కుమార్తె జీవాతో సరాదాగా గడిపిన కోహ్లీ.. (వీడియో)

జార్ఖండ్ డైమండ్‌ మ‌హేంద్ర సింగ్ ధోనీ కూతురు జీవాతో ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సరదాగా గడిపాడు. రాంచీ వేదిక‌గా మొన్న జ‌రిగిన టీ20లో ఆస్ట్రేలియాపై టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే.

జార్ఖండ్ డైమండ్‌ మ‌హేంద్ర సింగ్ ధోనీ కూతురు జీవాతో ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సరదాగా గడిపాడు. రాంచీ వేదిక‌గా మొన్న జ‌రిగిన టీ20లో ఆస్ట్రేలియాపై టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌కు తర్వాత కోహ్లీ ధోనీ ఇంటికి వెళ్లాడు.

ఈ సంద‌ర్భంగా జీవాతో క‌లిసి కోహ్లీ స‌ర‌దాగా ముచ్చ‌టించాడు. కుక్క‌లు, పిల్లుల గురించి ఇద్ద‌రూ మాట్లాడుకుని, వాటిని ఇమిటేట్ చేశారు. ముద్దులొలికే జీవాతో క‌లిసి మ‌ళ్లీ ఆడుకున్నాన‌ని తెలుపుతూ కోహ్లీ ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశాడు. గ‌తంలో కూడా జీవాతో క‌లిసి తీసుకున్న ఫొటోల‌ను కోహ్లీ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
 
ఇదిలా ఉంటే.. రాంచీలో జరిగిన తొలి ట్వంటీ-20లో కోహ్లీ ఫీల్డింగ్ ధోనీని అబ్బురపరిచింది. రాంచీలో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ-20 పోరులో భువనేశ్వర్ వేసిన 19వ ఓవర్‌లో డాన్ క్రిస్టియన్ షాట్ కొట్టగా, మిడాన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ, చాలా దూరం నుంచి దాన్ని ఓ బుల్లెట్‌లా వికెట్లపైకి విసిరేయగా, అది డైరెక్టుగా వచ్చి వికెట్లను తాకి డాన్‌ను అవుట్ చేసింది.