సౌతాఫ్రికా పర్యటనే కోహ్లీకి అసలైన సవాల్ : సౌరవ్ గంగూలీ
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ గొప్ప కెప్టెన్ అనిపించుకునేందుకు దక్షిణాఫ్రికా పర్యటన ఓ సవాల్ వంటిదని భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ అన్నారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, టీమిండియాకు ఎంతో మ
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ గొప్ప కెప్టెన్ అనిపించుకునేందుకు దక్షిణాఫ్రికా పర్యటన ఓ సవాల్ వంటిదని భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ అన్నారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, టీమిండియాకు ఎంతో మంది కెప్టెన్‌లుగా వ్యవహరించనీ, అయితే కపిల్ దేవ్, అజహరుద్దీన్, సౌరవ్ గంగూలీ, మహేంద్ర సింగ్ ధోనీలను మాత్రమే దిగ్గజ కెప్టెన్లుగా పేర్కొంటారన్నారు.
ఆ జాబితాలో ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చేరాలంటే రానున్న 15 నెలలు తానేంటో నిరూపించుకోవాలని జట్టు దిగ్గజ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సూచించారు. వరుస విజయాలు సాధిస్తున్న కోహ్లీ గొప్ప కెప్టెన్ అనడంలో సందేహం లేదని అన్నాడు, అయితే అతనికి వచ్చే పదిహేను నెలల కాలం ఎంతో కీలకమైనదని గుర్తుచేశాడు.
టీమిండియా ప్రస్తుతానికి టెస్టులు, వన్డేల్లో వరల్డ్ నెంబర్ వన్ స్థానంలో నిలిచిందని చెప్పిన గంగూలీ ఈ స్థానాన్ని నిలుపుకోవాలంటే చాలా కష్టపడాలని సూచించాడు. దానికి రానున్న 15 నెలల కాలం చాలా కీలకమైనదని స్పష్టం చేశాడు. కాగా, రానున్న 15 నెలల కాలంలో టీమిండియా సౌతాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా పర్యటనలతోపాటు ప్రపంచకప్ కూడా ఆడాల్సి ఉందన్నారు. ఈ సమయంలోనే కోహ్లీ తనను తాను నిరూపించుకోవాల్సి ఉంటుందని చెప్పుకొచ్చాడు.