మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 15 సెప్టెంబరు 2017 (10:40 IST)

నిండు గర్భణికి ఆపరేషన్ చేస్తూ.. కత్తెరను పొట్టలో పెట్టి మరిచిపోయిన వైద్యులు

జయశంకర్ జిల్లాలోని మహదేవపూర్ ప్రభుత్వాసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. నిండు గర్భిణికి ఆపరేషన్ చేస్తూ కత్తెరను పొట్టలోనే వుంచి ఆపరేషన్ పూర్తి చేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది

జయశంకర్ జిల్లాలోని మహదేవపూర్ ప్రభుత్వాసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. నిండు గర్భిణికి ఆపరేషన్ చేస్తూ కత్తెరను పొట్టలోనే వుంచి ఆపరేషన్ పూర్తి చేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది.

వివరాల్లోకి వెళితే మహదేవపూర్ ప్రభుత్వాసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బట్టబయలైంది. నెలలు నిండిన గర్భిణీ ఆస్పత్రికి రావడంతో ఆపరేషన్ చేసి ఆమెకు వైద్యులు డెలివరీ చేశారు. హడావుడిలో కత్తిని పొట్టలో వుంచేశారు. 
 
ఆపరేషన్ చేయించుకున్న గర్భిణి ఇంటికెళ్లిన.. గంటకే మళ్లీ పొట్టలో నొప్పి రావడంతో ఆస్పత్రికి వచ్చారు. తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్న ఆమెకు తీసిన పరీక్షల్లో వైద్యులు పొట్టలో కత్తెర వుంచడాన్ని గుర్తించారు. ఆమెకు మళ్లీ ఆపరేషన్ చేసిన వైద్యులు కత్తెరను బయటికి తీశారు. వైద్యుల నిర్లక్ష్య వైఖరిపై మహిళ తరపు బంధువులు మండిపడుతున్నారు.