బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 14 సెప్టెంబరు 2017 (13:55 IST)

ఢిల్లీలో దారుణం : రైలు రాదని నమ్మించి పార్కుకు తీసుకెళ్లి రేప్ చేశాడు...

ఢిల్లీలో మరో దారుణం జరిగింది. టాక్సీ డ్రైవర్ చేతిలో మరో యువతి మోసపోయింది. లుథియానా వెళ్లాల్సిన రైలు రద్దు అయిందని నమ్మించిన ఆ కామాంధుడు 23 యేళ్ళ యువతిని సమీపంలోని పార్కుకు తీసుకెళ్లి అత్యాచారం జరిపాడు

ఢిల్లీలో మరో దారుణం జరిగింది. టాక్సీ డ్రైవర్ చేతిలో మరో యువతి మోసపోయింది. లుథియానా వెళ్లాల్సిన రైలు రద్దు అయిందని నమ్మించిన ఆ కామాంధుడు 23 యేళ్ళ యువతిని సమీపంలోని పార్కుకు తీసుకెళ్లి అత్యాచారం జరిపాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.... 
 
ఈనెల 11వ తేదీన 23 యేళ్ల ఓ యువతి లూథియానా వెళ్లేందుకు ఢిల్లీ రైల్వే స్టేషన్‌కు వచ్చింది. 12వ తేదీ తెల్లవారుజామున 4.30గంటలకు రైలు వస్తుందని తెలియడంతో ఆమె మహిళల కోసం కోసం ఉండే విశ్రాంతి గదిలో సేదతీరింది. తెల్లవారుజామున సుమారు రెండు గంటల సమయంలో ఆ యువతి గది బయటకు వచ్చింది. 
 
ఆసమయంలో స్టేషన్ ఫ్లాట్‌ఫాంపై ఉన్న ఢిల్లీ, శాస్త్రి పార్క్‌ ప్రాంత నివాసి, టాక్సీ డ్రైవర్‌ చున్ను కుమార్‌ ఆమెతో మాటలు కలిపాడు. లూథియానా వెళ్లాల్సిన రైలును రద్దుచేసినట్లు ఆమెను నమ్మించాడు. ఆ తర్వాత తన టాక్సీలో ఢిల్లీ బస్టాండులో దింపుతానని, అక్కడ నుంచి బస్సులో వెళ్లొచ్చని చెప్పడంతో ఆ యువతి అతని మాటలు నమ్మి కారులో ఎక్కి కూర్చొంది. 
 
కారును స్టార్ట్ చేసిన కుమార్ నేరుగా ఎర్రకోట సమీపంలో ఉన్న గోల్డెన్‌ జూబ్లీ పార్కుకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను అదే కారులో తీసుకుని వచ్చి పాత ఢిల్లీ రైల్వేస్టేషన్‌ వద్ద వదిలేసి వెళ్లిపోయాడు. ఆ తర్వాత బాధితురాలు నోయిడాలోని తన సోదరుడి ఇంటికి వెళ్లి జరిగిందంతా వివరించింది. సోదరుడి సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు జరిపిన పోలీసులు కుమార్‌ను అరెస్టు చేశారు.