ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 12వ తేదీన ఇంటర్ ఫలితాలు?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలను విడుదల చేసేందుకు విద్యాశాఖ అధికారులు సిద్ధమయ్యారు. ఇందులోభాగంగా, ఈ నెల 12వ తేదీన ఈ ఫలితాలను రిలీజ్ చేయాలని ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటి, రెండో సంవత్సర ఫలితాలను ఒకేసారి విడుదల చేసేలా ప్లాన్ చేసేలా విద్యామండలి సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకన పూర్తయింది. ఇక ఫలితాలకు సంబంధించి అంతర్గత పనులు బుధవారం మధ్యాహ్నంతో పూర్తికానున్నాయి.
ఇందులో ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే ఫలితాలను ఒకటి రెండు రోజుల్లో ఆలస్యం కానున్నాయి. లేనిపక్షంలో ముందుగా అనుకున్నట్టుగానే ఈ నెల 12వ తేదీన విడుదల చేయనున్నారు. కాగా, ఏపీలో ఇంటర్ పరీక్షలు మార్చి 1 నుంచి మార్చి 20వ తేదీ వరకు జరిగిన విషయం తెల్సిందే. ఒకేషనల్, రెగ్యులర్ కలిపి మొదటి సంవత్సరంలో 5,17,617 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరంలో 5,35,056 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు.