మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: ఆదివారం, 17 ఫిబ్రవరి 2019 (11:59 IST)

చంటిబిడ్డతో తిరుమలలో ప్రత్యక్షమైన మంత్రి అఖిలప్రియ..

పెళ్ళయిన సరిగ్గా నాలుగు నెలలు కూడా కాలేదు అప్పుడే అఖిలప్రియకు బిడ్డ ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు. తిరుమలలో అఖిలప్రియను అలా చూసిన వారందరూ ఇలానే ఆశ్చర్యానికి గురైన వారే. ముక్కున వేలేసుకుని చూస్తూ ఉండిపోయారు. అసలు జరిగిందేమిటంటే..
 
తిరుమల శ్రీవారిని భూమా కుటుంబం దర్సించుకుంది. మంత్రి భూమా అఖిలప్రియతో పాటు ఆమె తమ్ముడు భూమా బ్రహ్మానందరెడ్డిలు, మిగిలిన కుటుంబ సభ్యులు దర్సించుకున్నారు. భూమా కుటుంబంలోని చిన్నబిడ్డ అతను. ముద్దుగా కొద్దిసేపు అఖిలప్రియ అతన్ని ఎత్తుకుని తిరుమల శ్రీవారిని దర్సించుకుని అలాగే బయటకు వచ్చింది. అఖిలప్రియ ఎత్తుకున్న బిడ్డను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కానీ ఆ విషయంపై ఆమె మాత్రం ఏమీ మాట్లాడలేదు.
 
కేవలం రాజకీయాల గురించి మాత్రం మాట్లాడారు. పార్టీని వదిలివెళ్ళేవారి వల్ల తమకు వచ్చే నష్టమేమీ లేదని, తెలుగుదేశంపార్టీ మరోసారి అధికారం చేజిక్కించుకోవడం ఖాయమన్నారు భూమా అఖిలప్రియ. తాను పార్టీని వీడే ప్రసక్తే లేదని, టిడిపిలోనే కొనసాగుతానన్నారు.