సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 11 ఫిబ్రవరి 2019 (18:35 IST)

చేతిలో బిడ్డతో వెళ్తున్న మహిళ.. వెనుక నుంచి ఎక్కిదిగిన జీపు?

కర్ణాటక రాష్ట్రంలో ఘోరం జరిగింది. కర్ణాటక, పుత్తూరు తాలూకాలోని, సంతలో ఓ మహిళ చేతిలో బిడ్డతో నడిచి వెళ్తుండగా వెనుకనుంచి వచ్చిన జీపు.. తల్లీబిడ్డలపై ఎక్కి దిగింది. వెంటనే ఆ సంతలోని ప్రజలు హుటాహుటిన మహిళను, బిడ్డను కాపాడారు. ఈ ఘటనలో చిన్నపాటి గాయాలతో తల్లీబిడ్డ తప్పించుకున్నారు. 
 
ఈ ఘటనపై పోలీసులు జీపు డ్రైవర్ వద్ద జరిపిన విచారణలో.. జీపును తాళంతో అలానే నిలబెట్టి.. పక్క షాపుకు వెళ్లాడని.. ఆ సమయంలో అక్కడ ఆడుకుంటున్న చిన్నారులు.. జీపు తాళాన్ని మెల్లగా తిప్పేశారు. దీంతో వేగంతో ముందుకు నడిచిన జీపు.. సమీపంలో చేతిలో బిడ్డతో సహా నడిచి వెళ్తున్న మహిళపై ఎక్కి దిగింది. ఆపై ఓ గోడకు ఢీకొని ఆగిపోయింది. 
 
ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. చేతిలో బిడ్డతో నడుస్తూ వెళ్తున్న మహిళను వెనకు నుంచి వచ్చిన జీపు ఎక్కి దిగడానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన వారంతా షాకవుతున్నారు.