సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 10 ఫిబ్రవరి 2019 (18:10 IST)

ఆ లెక్చరర్ మామూలోడు కాదు... నీలి చిత్రాల్లో నటించాలని భార్యపై ఒత్తిడి

ఆయన విద్యాబుద్ధులు చెప్పే లెక్చరర్. నాలుగు మంచి మాటలు చెప్పి చిన్నారుల భవిష్యత్‌కు బంగారు బాటలు వేయాల్సిన వ్యక్తి. కానీ, తనలోని వక్రబుద్ధిని బయటపెట్టాడు. కట్టుకున్న భార్యను నీలి చిత్రాల్లో నటించాలని ఒత్తిడి తెచ్చాడు. చివరకు కటకటాల పాలయ్యాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
కర్ణాటక రాష్ట్రంలోని నేలమంగళ అనే ప్రాంతానికి చెందిన వసంత్ కుమార్ (42) అనే వ్యక్తి ఓ కాలేజీలో లెక్చరర్‌గా పని చేస్తున్నాడు. ఈయన 2004లో వివాహమైంది. ఈమె ఓ ఎన్జీవో సంస్థలో పని చేస్తుండగా, పెళ్లయిన తర్వాత ఉద్యోగాన్ని మాన్పించివేశాడు. దీంతో భార్య ఇంటిపట్టునే ఉంటూ తన ఇద్దరు పిల్లలను చూసుకుంటూ వస్తోంది. 
 
అయితే కొన్నాళ్ల తర్వాత ఆమెను భర్త వేధించడం మొదలెట్టాడు. పుట్టింటికి వెళ్లి, డబ్బులు తీసుకురావాలని అదనపు కట్నం కోసం వేధించసాగాడు. అయితే, తమ తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఆమె భర్త పెట్టే వేధింపులను భరిస్తూ వచ్చింది. ఈ క్రమంలో భర్త వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. ఇంట్లో తిని, కూర్చుంటున్నావని ఆమెను దూషిస్తూ... చులకన చేయసాగాడు. అంతేకాకుండా పిల్లలు తనకు పుట్టలేదని, ఎవ్వరితోనే సంబంధం పెట్టుకున్నావని పిచ్చిపిచ్చిగా మాట్లాడుతూ వేధించేవాడు. ఈ వేధింపులు ఎక్కువ కావడంతో కావాలంటే డీఎన్ఏ పరీక్ష చేసుకోమని తెగేసి చెప్పిందామె. 
 
ఆ తర్వాత కొన్నిరోజులకు తన భార్యకు ఎయిడ్స్ ఉందని ప్రచారం చేయడం మొదలెట్టాడు. అయినా ఆమె భర్తను విడిచె వెళ్లలేదు. ఇక లాంభంలేదనుకుని భావించిన ఆయన... ఓ మిడ్డీ డ్రెస్ తీసుకొచ్చిన దాన్ని వేసుకుని పోర్న్ సినిమాల్లో నటించాలని కోరాడు. ఇద్దరం కలిసి శృంగారంలో పాల్గొని, ఆ వీడియోను పోర్న్ సైట్లకు అమ్ముదామని చెప్పాడు. ఆమె కాదనే సరికి... కత్తి తీసుకుని చంపుతానని బెదిరించాడు. దాంతో డ్రెస్ వేసుకుంటానని బాత్రూమ్‌లోకి వెళ్లినట్టు వెళ్లిన ఆమె... అతన్ని గదిలోపెట్టి తలుపు వేసి బయటికి పారిపోయింది. భర్త చేస్తున్న చిత్ర హింసలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు శాడిస్టు భర్తను అరెస్టు చేశారు.