శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శనివారం, 9 ఫిబ్రవరి 2019 (20:38 IST)

భార్యతో ఆ భంగిమలో యువకుడు.. భర్త ఆ పని చేశాడు...

తన భార్య ఒక యువకుడితో అసభ్యకర భంగిమలో భర్తకు కనిపించింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయాడు భర్త. యువకుడిని బట్టలు లేకుండా అడవిలో కత్తితో ముక్కలు ముక్కలుగా నరికాడు. స్థానికులు ఏమాత్రం ఆ వ్యక్తిని అడ్డుకోలేదు. హత్య జరిగిన తరువాత పోలీసులకు సమాచారమిచ్చారు.
 
చిత్తూరు జిల్లా కె.వి.బి.పురం మండలంలోని దిగువపూడి గ్రామంలో వంశీకృష్ణ(19) దారుణ హత్యకు గురయ్యాడు. దిగువపూడి గ్రామానికి చెందిన గోవిందరాజులు కుమారుడు వంశీకృష్ణ అదే గ్రామానికి చెందిన నాగేశ్వరరావు భార్యతో అక్రమసంబంధం పెట్టుకున్నాడు. నిన్న రాత్రి వ్యవసాయ పనుల కోసం వెళ్ళి తిరిగి వచ్చాడు నాగేశ్వర రావు. ఆ సమయంలో అతని భార్య వంశీక్రిష్ణతో కలిసి కనిపించింది.
 
దీంతో ఆగ్రహంతో ఊగిపోయాడు. ఆ యువకుడిని రోడ్డుపై లాక్కుంటూ పక్కనే ఉన్న అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్ళాడు. వ్యవసాయానికి వాడే కత్తితో ఆ యువకుడిని అతి దారుణంగా చంపేశాడు. ఆ తరువాత పోలీసులకు లొంగిపోయాడు.