సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజయవాడ , బుధవారం, 18 ఆగస్టు 2021 (14:29 IST)

వైసీపీ నేతల డిక్టేషన్ ఫాలో కావ‌ద్దు... శిక్ష ప‌డుతుంది!

రాష్ట్రంలో విధ్వంసకర పాలన సాగుతోంద‌ని, ప్రజా సంపద లూటీ అవుతోంద‌ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజ‌రపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. చట్ట ధిక్కరణ చర్యలు యదేచ్ఛగా కొనసాగుతున్నాయ‌ని, ప్రజల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింద‌న్నారు.

బాధితులకు న్యాయం చేయమని కోరిన వారిపైన, బాధితులను పరామర్శించే వారిపైన అక్రమ కేసులు పెట్టడం రాజ్యాంగ విరుద్ధం కాదా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. పోలీసు అధికారులు రాజకీయ ఒత్తిడులకు లోనై చట్టాలకు, న్యాయానికి విరుద్ధంగా ఏకపక్షంగా వెళితే సమస్యల్లో పడుతారు. గతంలో జగన్ రెడ్డి తండ్రి ఆదేశాలను గ్రుడ్డిగా అనుసరించి చట్ట వ్యతిరేక పనులు చేసిన కొంతమంది ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు అగౌరవ పాలు అవడమే కాకుండా జైళ్లకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. నేడు జగన్ రెడ్డి పాలనలో కూడ రెండున్నరేళ్లలోనే ఇప్పటికే కొందరు ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు అటు కేంద్రం,, ఇటు హైకోర్టు, ఎన్జీటి ల ముందు తలవంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిండి. గత ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం నుండి అవార్డులు, రివార్డులు పొందిన అధికారులు నేడు అదే కేంద్రం దగ్గర, కోర్టుల్లోను ఎవరి వల్ల తలవంచుకోవాల్సిన పరిస్థితి వచ్చిందో ఆలోచించుకోండని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

ఇండియా టుడే సర్వేలను చూస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం పై ప్రజా వ్యతిరేకతను చూస్తున్నారు. వైసీపీ నేతల లూఠీని చూస్తున్నారు. లూఠీ కోసం రాష్ట్రాన్ని ఆర్ధిక సంక్షోభంలోకి నెట్టారు. జగన్ రెడ్డి అధికారం శాశ్వతం కాదు. కాబట్టి నమ్ముకోవాల్సింది వైసీపీ నేతలను కాదు. ప్రజలను, చట్టాలను నమ్ముకుని గౌరవప్రదంగా జీవించండి. కేవలం పోస్టింగుల కోసం కొందరు అధికారులు చట్టాలను అతిక్రమించి గుడ్డిగా వైసీపీ నేతల డిక్టేషన్ ను ఫాలో అయి, మీ గౌరవానికి, వృత్తి ధర్మానికి నష్టం కల్పించుకోవద్దని పేర్కొన్నారు.