సంబంధిత వార్తలు
- బంగాళాఖాతంలో పురుడు పోసుకొనున్న 'యాస్'
- పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలి: టీపీసీసీ చీఫ్ ఉత్తమ్
- మళ్లీ పెరిగిన గ్యాస్ ధర
- LPG Gas cylinder: ఎంత పెంచినా కొంటున్నారుగా, ఇక ఇలా వడ్డిద్దాం, ప్రతివారం గ్యాస్ సిలిండర్ ధరల మోత
- ఇండేన్ గ్యాస్ వినియోగదారులకు శుభవార్త.. మిస్డ్ కాల్‌తో గ్యాస్ బుకింగ్
అతి తీవ్ర తుఫానుగా యాస్, బాలాసోర్ వద్ద తీరం దాటుతూ వుంది
వాయువ్య బంగాళాఖాతంలో అతి తీవ్ర తుఫానుగా యాస్ కొనసాగుతోంది. ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ ఈరోజు మధ్యాహ్నం, ఉత్తర ఒరిస్సాలోని ధర్మ, బాలసోర్ మధ్య తీరం దాటుతూ వుంది. ఇది ప్రస్తుతం గంటకు 12 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది.
పారాదీప్‌కు తూర్పు దిశగా 90 కిలోమీటర్లకు, బాలాసోర్‌కి దక్షిణ ఆగ్నేయంగా 140, కిలోమీటర్లు, ధర్మాకి తూర్పు ఆగ్నేయంగా దిశగా 85 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.
తుపాను తీరం దాటే సమయంలో గంటకు 155 నుంచి 165 కొన్నిసార్లు 180 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి.ప్రస్తుతం తీరం వెంబడి గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. తుపాను నేపథ్యంలోమత్స్యకారులు ఎవరు వేటకి వెళ్ళకూడదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
