గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 2 జనవరి 2021 (20:05 IST)

ఇండేన్ గ్యాస్ వినియోగదారులకు శుభవార్త.. మిస్డ్ కాల్‌తో గ్యాస్ బుకింగ్

ఇండేన్ గ్యాస్ వినియోగదారులకు ఇది శుభవార్తే. గ్యాస్ సిలిండర్ బుకింగ్ కోసం ఇక ఆపసోపాలు పడాల్సిన అవసరం లేదు. ఇకపై ఒకే ఒక్క మిస్డ్ కాల్‌తో గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేసుకోవచ్చు.

ఇందుకోసం 84549 55555 నెంబరును ఇండియన్ ఆయిల్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేసుకోవచ్చని పేర్కొంది.

ఇందుకోసం ఎలాంటి చార్జీలు వసూలు చేయబోమని స్పష్టం చేసింది. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మిస్డ్ కాల్ సదుపాయాన్ని ప్రారంభించారు.