ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 13 ఫిబ్రవరి 2018 (10:53 IST)

కి'లేడీ' ఏఎస్పీ సునీతా రెడ్డి .. ముగ్గురితో వ్యవహారం నడిపిందా?

తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖలో ఏఎస్పీగా పని చేస్తున్న సునీతారెడ్డి మామూలు లేడీ కాదనీ కిలాడీ అని తెలుస్తోంది. ఈమె సురేందర్ రెడ్డితో పెళ్లికి ముందే లెనిన్ అనే యువకుడిని పెళ్లి చేసుకున్నట్టు తాజాగా

తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖలో ఏఎస్పీగా పని చేస్తున్న సునీతారెడ్డి మామూలు లేడీ కాదనీ కిలాడీ అని తెలుస్తోంది. ఈమె సురేందర్ రెడ్డితో పెళ్లికి ముందే లెనిన్ అనే యువకుడిని పెళ్లి చేసుకున్నట్టు తాజాగా సమాచారం. దీనికి సంబంధించిన ఫోటోలు ఇపుడు నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ పెళ్ళి కూడా హైదరాబాద్‌లోని ఆర్య సమాజంలో జరిగింది. తాజాగా వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
సీఐ మల్లికార్జునరెడ్డితో ఏఎస్పీ సునీతారెడ్డి కలిసుండగా, భర్త సురేందర్, సునీత తల్లి, పెద్దమ్మలు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని చెప్పులతో కొట్టిన వీడియో గత నెలలో వెలుగులోకి వచ్చిన తర్వాత పోలీసు అధికారులు ఇద్దరినీ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.
 
ఇపుడు సునీతా రెడ్డి తొలి వివాహానికి సంబంధించిన ఫోటోలు లీక్ అయ్యాయి. ఓ సింగర్ సోదరుడు లెనిన్‌ను 2002లో సునీత వివాహం చేసుకుని, ఆ తర్వాత రెండేళ్ళకే అతనిపై వరకట్న వేధింపుల కేసు పెట్టి దూరమైంది. ఆ తర్వాత సురేందర్ రెడ్డిని రెండో పెళ్లి చేసుకుంది. అతనితో ఉంటూనే, సీఐ మల్లికార్జున రెడ్డితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. మొత్తానికి ఈ కిలాడీ ఏకంగా ముగ్గురితో సంబంధం కొనసాగించింది. 
 
తాజాగా ఫొటోలతోపాటు ఆసక్తికర విషయాలు మళ్లీ వెలుగు చూడటంతో ఏఎస్పీ సునీతారెడ్డి మరోసారి వార్తల్లోకెక్కారు. కాగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన వార్తలను ఆమె భర్త సురేందర్‌రెడ్డి ఖండించారు. ఫొటోలను మార్ఫింగ్‌ చేసి ఇలాంటి ప్రయత్నాలకు పాల్పడి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేశారు.