ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By tj
Last Updated : సోమవారం, 12 ఫిబ్రవరి 2018 (17:07 IST)

అప్పుడే పెళ్ళా... ఇంకా ఐదేళ్ళ సమయం ఉంది..

తన బాయ్ ఫ్రెండ్‌తో చట్టాపట్టాలేసుకుని తిరుగుతూ పెళ్ళి దాకా తెచ్చుకుంది శృతి హాసన్. పెళ్ళి చేసుకొని ఆ తర్వాత సినిమాల్లో నటించాలనుకుంది. కానీ పెళ్ళి చేసుకున్న తర్వాత చాలా మంది హీరోయిన్లు సినిమాల్లో నటిం

తన బాయ్ ఫ్రెండ్‌తో చట్టాపట్టాలేసుకుని తిరుగుతూ పెళ్ళి దాకా తెచ్చుకుంది శృతి హాసన్. పెళ్ళి చేసుకొని ఆ తర్వాత సినిమాల్లో నటించాలనుకుంది. కానీ పెళ్ళి చేసుకున్న తర్వాత చాలా మంది హీరోయిన్లు సినిమాల్లో నటించడం అస్సలు సాధ్యం కాలేదు. ఎవరో కొంతమంది తప్ప. దీంతో శృతి పెళ్ళినే వాయిదా వేసుకుంది. అది కూడా ఏకంగా ఐదేళ్ళు. నాకు సినిమాల్లో నటించడమన్నా.. మంచి క్యారెక్టర్ చేయడమన్నా ఇష్టం. నాకు సంగీతం తెలుసు. కథలు రాయగలను.. చాలా వాటిల్లో నేను రాణించగలను కూడా. 
 
సినిమా హీరోయిన్ అవుతానని అస్సలు అనుకోలేదు. కానీ టాప్ హీరోయిన్‌గా ముందుకు వెళుతుండడం సంతోషంగానే ఉంది. అయితే ఒక్కటి పెళ్ళిని నేను వాయిదా వేసుకుంటున్నాను. నేను చేయాల్సింది ఇంకా చాలా ఉంది. అందుకే పెళ్ళిని ఆలస్యంగా చేసుకుందామని నా ప్రియుడితో చెప్పా. అతను కూడా ఓకే చెప్పాడంటోంది శృతి హాసన్.