1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Chandrababu Naidu slips word on Jaganmohan Reddy

జగన్‌ని చంద్రబాబు అలా అనేశారే?

Chandrababu Naidu
ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ ఎపి సిఎం చంద్రబాబునాయుడు తాను ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదు. ఒకవైపు కోపం, మరోవైపు అసహనంతో నోటికొచ్చినట్లు మాట్లాడేస్తున్నారు. ఏకంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు ఆ తరువాత ఎపి ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టలేదు.
 
రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌ను కలిసేందుకు నిన్న వెళుతున్న సమయంలో మీడియాతో మాట్లాడారు చంద్రబాబునాయుడు. ఎన్నికల స్టంట్‌గా చంద్రబాబు హామీలు ప్రజలకు ఇస్తున్నారని జగన్ అనంతపురంలో జరిగిన బహిరంగ సభ వేదికగా చెప్పినట్లు ఒక మీడియా ప్రతినిధి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళారు. దీంతో చంద్రబాబుకు ఎక్కడా లేని ఆవేశం వచ్చింది.
 
వాడికేం పని అంటూ ఆయనకేం పనిలేదని మాట మార్చారు చంద్రబాబు. ఒక్కసారిగా బాబు ఆ మాటలు అనడంతో మీడియా ప్రతినిధులే ఆశ్చర్యపోయారు. సహనం కోల్పోయి ఆయన ప్రవర్తిస్తున్న తీరు రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేసింది. వయస్సులో చిన్నవారే కావచ్చు.. ఒక పార్టీకి అధినేత. అందులోను ఎపికి ప్రతిపక్షనేత. అలాంటి వ్యక్తిని చంద్రబాబు వాడు అనడం మాత్రం ఖచ్చితంగా తప్పంటున్నారు విశ్లేషకులు. 
 
బాబు ఒకరే కాదు అనంతపురం ఎంపి జెసి దివాకర్ రెడ్డి కూడా ఇప్పటికే చాలాసార్లు జగన్‌ను టార్గెట్ చేస్తూ వాడు.. వీడు అన్న సంధర్భాలు ఉన్నాయి. అయితే జగన్ మాత్రం ఆ వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోలేదు. జెసి విషయాన్ని పక్కనబెడితే చంద్రబాబు నాయుడు ఢిల్లీలో జగన్ పైన చేసిన వ్యాఖ్యలు మాత్రం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.
తర్వాతి కథనం
లోక్‌సభ లాస్ట్ డే.. : షాకిచ్చిన ములాయం.. మళ్లీ ప్రధానిగా మోడీ కావాలంటూ...