1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Chandrababu will meet with the Governor tomorrow evening

రేపు సాయంత్రం గవర్నర్‌తో చంద్రబాబు భేటి

Chandrababu
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గురువారం ఏపీ గవర్నర్‌తో భేటీ కానున్నారు. రాష్ట్రంలో పరిణామాలపై గవర్నర్ కు వివరించనున్నారు. 

వైసిపి పాలనలో ప్రాథమిక హక్కులు కాలరాయడం, న్యాయ నిబంధనల(రూల్ ఆఫ్ లా) ఉల్లంఘన, రాజ్యాంగ వ్యవస్థల విచ్ఛిన్నం, ప్రజాస్వామ్య 4మూల స్థంభాలను కూలదోసే దుశ్చర్యలు, టిడిపి నాయకులు- కార్యకర్తలపై తప్పుడు కేసులు-అరెస్ట్ లు, దళితులపై దాడులు-దౌర్జన్యాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో అరాచకాలు,

4రోజుల్లో ముగ్గురు బీసి మాజీ మంత్రులపై తప్పుడు కేసులు, వైసిపి అప్రజాస్వామిక చర్యలు, బిసి,ఎస్సీ,ఎస్టీ ముస్లిం మైనారిటి వర్గాలకు- మహిళలకు కొరవడిన భద్రత, వైసిపి నాయకుల అవినీతి కుంభకోణాలపై ఫిర్యాదు చేయనున్నారు. దీని పట్ల అన్ని వర్గాలు ఆసక్తి ఎదురు చూస్తున్నాయి.
తర్వాతి కథనం
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం... లారీ, ట్రాక్ట‌ర్ ఢీ.. 12 మంది దుర్మ‌ర‌ణం