గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 16 జూన్ 2020 (21:40 IST)

దేశంలోనే తొలిసారిగా 'గవర్నర్‌ ఆన్‌లైన్‌ ప్రసంగం'

మంగళవారం ఉదయం ప్రారంభమైన బడ్జెట్‌ సమావేశాల్లో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు.

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో.. ఆయన వయసును దఅష్టిలో ఉంచుకుని, అసెంబ్లీకి వెళ్లవద్దని అధికారులు సూచించడంతో, రాజ్‌ భవన్‌ నుండి ఆయన ప్రసంగాన్ని ప్రారంభించారు. భారత్‌లో ఒక గవర్నర్‌ ఇలా ఆన్‌ లైన్‌ మాధ్యమంగా అసెంబ్లీని ఉద్దేశించి మాట్లాడటం ఇదే తొలిసారి.

ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ.. గవర్నర్‌ తన ప్రసంగంలో తన ప్రభుత్వం ఒక నవ శకానికి నాంది పలికిందని వ్యాఖ్యానించారు. ఎపి అసెంబ్లీని మిగతా రాష్ట్రాలు భవిష్యత్తులో అనుసరించవచ్చని అన్నారు.

సంక్షేమ పథకాలతో పాటు ఇతర అంశాలపై ఆయన ప్రసంగం కొనసాగింది. కాగా, గవర్నర్‌ ప్రసంగం అనంతరం, మధ్యాహ్నం ఒంటిగంటకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.