సంబంధిత వార్తలు
- సుశాంత్ ఆత్మహత్య చేసుకోలేదు.. చంపేశారు : ఫ్యామిలీ ఫ్రెండ్ స్మితా పారిఖ్
- అయోధ్యపై ఐసిస్ గురి - ఆగస్టు 5న భారీ విధ్వంసానికి కుట్ర
- పగటిపూట నిద్రతో మధుమేహం తప్పదా?
- దళిత యువకుడి శిరోముండనం వెనక ఉన్న ప్రతి ఒక్కరినీ బాధ్యుల్ని చేయాలి: నాదెండ్ల మనోహర్
- తితిదే దర్శన టిక్కెట్లు ఇచ్చినా తిరుమలకు రాని భక్తులు, ఎందుకని?
అమ్మో చిరుత, అక్కడే కూర్చుని భక్తులపై దాడి చేస్తోంది, ఎక్కడ?
శేషాచలం అటవీ ప్రాంతం అంటేనే ఎన్నో క్రూరమృగాలు ఉంటాయి. ముఖ్యంగా చిరుతలు, ఏనుగులు, మిగిలిన జంతువులన్నీ ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. అయితే జనసంచారం పెద్దగా తిరుమలలో లేకపోవడంతో జంతువులన్నీ రోడ్లపైకి వచ్చేస్తున్నాయి. తాజాగా ఓ చిరుత తిరుపతిలోని రెండవ ఘాట్ రోడ్డులో ప్రత్యక్షమైంది.
మధ్యాహ్నం ద్విచక్రవాహనంపై వెళుతున్న వాహనదారుడిపై అలిపిరి టోల్ గేట్ నుంచి సరిగ్గా నాలుగు కిలోమీటర్ల దూరంలో దాడి చేసింది. ఆ తరువాత అక్కడే కూర్చుండి పోయింది. మరో ఇద్దరు వేర్వేరు ద్విచక్రవాహనాల్లో వెళుతుండగా వారి మీద కూడా దాడి చేసింది. ఎలాగోలా వారు తప్పించుకుని తిరుమలకు చేరుకున్నారు.
కానీ చిరుత మాత్రం అదే ప్రాంతంలో కూర్చుని ఉంది. అలిపిరి టోల్ గేట్ నుంచి సరిగ్గా నాలుగుకిలోమీటర్ల దూరంలో చిరుత ఉందట. దీంతో విషయం కాస్త టిటిడితో పాటు అటవీశాఖ అధికారుల దృష్టికి వెళ్ళింది. అటవీశాఖాధికారులు రంగంలోకి దిగారు.
చిరుతను అటవీ ప్రాంతంలోకి తరిమేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ వాహనాలను మాత్రం యధావిధిగా ఘాట్ రోడ్డులో పంపించేస్తున్నారు. ఐదు, ఆరు వాహనాలను ఒకేసారి తిరుమలకు అనుమతిస్తున్నారు. మరోసారి చిరుత సంచారం శేషాచలం అటవీ ప్రాంతంలో ఉండడంతో స్థానికుల్లో తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది.
