1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. clay ganesh idols free distribution by seva bharathi

సేవా భారతి ఆధ్వర్యంలో వినాయక మట్టి ప్రతిమలు పంపిణీ

clay
ప్రకృతిని, పర్యావరణంను కాపాడాలి... అనే సదుద్దేశంతో సేవా భారతి విజయవాడలో మారుతినగర్ శాతవాహన కళాశాలలో వినాయక మట్టి ప్రతిమలు పంపిణీ చేసింది. పాదచారులు, చిన్న చిన్న దుకాణదారులకు , స్థానికులకు మ‌ట్టి గ‌ణేష్ ల‌ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సేవా భారతి సభ్యురాలు పాలూరి సూర్య రత్నమణి పాల్గొన్నారు.

ఆర్ఎస్ఎస్ నగర ఇన్చార్జి పడాల శ్రీనివాస్   మాట్లాడుతూ, సేవా భారతి వారి సహకారంతో ప్రతి సంవత్సరం వినాయకుని మట్టి ప్రతిమలు ఉచితంగా పంపిణీ చేస్తున్నామ‌ని చెప్పారు. గత సంవత్సరం కోవిడ్ వల్ల కొంచెం ఆటంకం కలిగినా, మ‌ట్టి వినాయ‌కుల పంపిణీ మాత్రం ఆగలేదని తెలిపారు. అదే స్ఫూర్తి ని కొనసాగిస్తూ ప్రతీ సంవత్సరం పంపిణీ చేస్తూ, పర్యావరణం రక్షణకు తమవంతు సహాయ సహకారాలు అందిస్తున్నారని శ్రీనివాస్ కొనియాడారు.

ఈ కార్యక్రమంలో కుచిబోట్ల కృష్ణ, కొండా సైదులు, రాజీవ్ ప్రతాప్, అప్పలనాయుడు, రజినీకాంత్, ధర్మవరపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
తర్వాతి కథనం
లండ‌న్‌కు హైదరాబాద్ నుంచి నేరుగా నాన్ స్టాప్‌ ఫ్లయిట్‌!