గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , గురువారం, 9 సెప్టెంబరు 2021 (15:31 IST)

లండ‌న్‌కు హైదరాబాద్ నుంచి నేరుగా నాన్ స్టాప్‌ ఫ్లయిట్‌!

ఎయిరిండియా హైదరాబాద్‌– లండన్‌ మధ్య నాన్ స్టాప్‌ విమాన స‌ర్వీసును ప్రారంభించింది. తొలి విమానం గురువారం హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్‌ కానుంది. ఇదే విమానం తిరిగి 10వ తేదీ శుక్రవారం లండన్‌ బయల్దేరి వెళుతుంది. 256 సీట్ల సామర్థ్యంతో బిజినెస్ క్లాస్‌ 18, ఎకానమీ క్లాస్‌ 238 సీట్లు కలిగిన బోయింగ్‌ 787 డ్రీమ్ లైనర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ను వారానికి రెండు సర్వీసుల కింద ఎయిరిండియా నడపనుంది.
 
హైదరాబాద్‌ నుంచి ప్రతి సోమవారం, శుక్రవారం లండన్‌కు విమాన సర్వీసు ఉంటుందని ఎయిరిండియా తెలిపింది. ప్రయాణ సమయం 10.30 గంటలు. అదే లండన్‌ నుంచి హైదరాబాద్‌ మార్గంలో ప్రయాణ సమయం 9.20 గంటలుగా ఉంటుందని పేర్కొంది. ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, అమృత్‌సర్, కొచ్చి, అహ్మదాబాద్, గోవా విమానాశ్రయాల నుంచి లండన్‌కు ఎయిరిండియా నాన్‌స్టాప్ సర్వీసుల‌ను నిర్వహిస్తోంది.