గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 26 ఆగస్టు 2021 (16:03 IST)

స్మార్ట్ ఫోన్ నుంచి మంటలు... విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది..

స్మార్ట్ ఫోన్ నుంచి మంటలు వ్యాపించడంతో విమానం ఆగిపోయింది. 128 మంది ప్రయాణికులతో న్యూ ఓర్లీన్స్ నుంచి సీటెల్‌ వెళ్తున్న అలాస్కా 751 విమానంలోని ఓ ప్రయాణికుడి సెల్‌ఫోన్ నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
 
ఈ ఘటనలో కొందరు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. సెల్‌ఫోన్‌లో మంటలు చెలరేగిన వెంటనే అప్రమత్తమైన విమాన సిబ్బంది వాటిని అదుపు చేశారు. 
 
అనంతరం విమానాన్ని సీటెల్-టకోమా అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. విమానంలోని 128 మంది ప్రయాణికులు, సిబ్బందిని సురక్షితంగా బస్సులో తరలించారు. మంటలు చెలరేగిన స్మార్ట్‌ఫోన్ పూర్తిగా దగ్ధమైంది.