శనివారం, 28 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎంజీ
Last Updated : సోమవారం, 30 ఆగస్టు 2021 (09:45 IST)

సెప్టెంబర్‌ 30 వరకు అంతర్జాతీయ విమానాలపై నిషేధం

సెప్టెంబర్‌ 30వ తేదీ వరకు అంతర్జాతీయ విమానాల రాకపోకలపై ఉన్న నిషేధాన్ని పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. కొన్ని రాష్ట్రాల్లో పాజిటివ్‌ కేసులు మళ్లీ పెరుగుతున్న సంగతి తెలిసిందే.

దీంతో అంతర్జాతీయ విమానాలపై నిషేధాన్ని కేంద్రం మరో నెలరోజుల పాటు పొడిగించింది. అయితే కార్గో విమాన సర్వీసులకు ఈ నిబంధన వర్తించదని స్పష్టం చేసింది.

డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డిజిసిఎ) అంతర్జాతీయ షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ ప్యాసింజర్‌ ఫ్లైట్‌లపై విధించిన నిషేధాన్ని ఆగస్టు 31 నుండి సెప్టెంబర్‌ 30 వరకు పొడిగించింది.

అర్హత ఉన్న, అధికారికంగా ఎంపిక చేసిన మార్గాలలో అంతర్జాతీయ షెడ్యూల్‌ విమానాలను అనుమతించవచ్చునని పేర్కొంది.