గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 29 ఆగస్టు 2021 (19:54 IST)

కాబూల్‌లో మరో బాంబు దాడి... అమెరికా పౌరులే లక్ష్యంగా...

తాలిబన్ తీవ్రవాదుల ఆక్రమించుకున్న ఆప్ఘనిస్థాన్ దేశ రాజధాని మరోమారు బాంబుదాడి జరిగింది. ఈ దాడిలో ఇద్దరు మరణించగా, మరో నలుగురు గాయపడ్డారు. 
 
మూడు రోజు క్రితం కాబూల్ ఎయిర్‌పోర్టు బయట జరిగిన బాంబు పేలుళ్లు జరిగిన విషయం తెల్సిందే. ఈ దాడి ఘటనను ఇంకా మరిచిపోకముందే ముష్కరులు మరోమారు రెచ్చిపోయారు. మళ్లీ బాంబు దాడితో విరుచుకుపడ్డారు. 
 
ఖవాజా బఘ్రాలోని గులాయి ప్రాంతంలో ఓ భవనాన్ని లక్ష్యంగా చేసుకొని రాకెట్ దాడి జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. అక్కడ ఇద్దరు మరణించారని, మరో నలుగురు గాయపడ్డారు. 
 
మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముంది. అయితే, ఈ దాడుల వెనుక ఐఎస్ హస్తమున్నట్టు సమాచారం. కాబూల్‌లో ఉన్న అమెరికన్ పౌరులు, సైనికులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగినట్టు తెలుస్తోంది.