గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 27 ఆగస్టు 2021 (10:52 IST)

ఐసీస్ నేతలను హతమార్చాలి.. వేటాడి ప్రతీకారం తీర్చుకుంటాం- జో బైడెన్

ఆప్ఘనిస్థాన్‌లో తాలిబన్ల సహకారంతో అమెరికాకు తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఐసిస్‌ మానవ బాంబు దాడులతో విరుచుకుపడింది. ఈ దుర్ఘటనల్లో 75 మంది చనిపోగా.. వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు.  
 
ఆఫ్ఘనిస్తాన్‌లోని కాబూల్‌లో జరిగిన పేలుళ్లను ప్రపంచ దేశాలు ఖండించాయి. ఐసీస్ నేతలను హతమార్చాలని ఆర్మీకి జో బైడెన్ ఆదేశాలు జారీ చేశారు. బాధ్యులెవరైనా క్షమించే ప్రసక్తే లేదన్నారు.  ఈ దాడిని అంతతేలికగా తాము మరిచిపోమని... ఈ దాడితో ఉగ్రవాదం గెలిచినట్లే కాదని తెలిపారు. ఈ ఘటనపై వెంటాడి వేటాడి ప్రతీకారం తీర్చుకుంటామన్నారు. 
 
ఆఫ్ఘన్ గడ్డపై అమెరికా దళాల సేవల్ని విజ్ఞప్తి తెచ్చుకున్న ఆయన.. మరణించిన వాళ్లకు సంఘీభావంగా కాసేపు మౌనం పాటించారు. జరిగిన నష్టానికి తానే బాధ్యత అని ప్రకటించుకున్న బైడెన్‌.. సైన్యం తరలింపు ఆలస్యానికి తమ నిర్ణయాలే కారణమని స్పష్టం చేశారు. 
 
అయితే ఈ దాడి తరలింపు ప్రక్రియపై ఎలాంటి ప్రభావం చూపబోదని, అనుకున్న గడువులోపు తాలిబన్ల సహకారంతో సైన్యం-పౌరుల తరలింపు ప్రక్రియ పూర్తి చేస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నామని బైడెన్‌ స్పష్టం చేశారు.