సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 26 ఆగస్టు 2021 (10:01 IST)

ఎంత త్వరగా వెనక్కి వచ్చేస్తే అంత మంచిది.. బైడెన్

కాబూల్‌లోని హమీద్‌ కర్జాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో 5,800 మంది అమెరికా సైనికులు ఉన్నారు. ఆగస్టు 31 లోగా బలగాలను ఉపసంహరించేలా కార్యక్రమం కొనసాగుతోంది. కానీ ఎంత త్వరగా అమెరికా సైనికులు వెనక్కి వచ్చేస్తే అంత మంచిదని బైడెన్‌ అభిప్రాయపడ్డారు. 
 
‘‘ఒక్కోరోజు గడుస్తున్న కొద్దీ వారికి ముప్పు పెరుగుతూ ఉంటుంది. తాలిబన్లు తమ కార్యకలాపాలకు ఎలాంటి అడ్డంకి కల్పించకుండా, విమానాశ్రయాలోకి అన్నీ అనుమతిస్తే పని తొందరగా అవుతుంద’’ని బైడెన్‌ అన్నారు.
 
ఆగస్టు 31 తర్వాత అమెరికా బలగాలను అఫ్గనిస్తాన్‌లో ఉండేందుకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతినివ్వబోమని తాలిబన్ల అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్‌ స్పష్టం చేసిన నేపథ్యంలో.. వాళ్ల సహకారంతోనే బలగాల ఉపసంహరణ కొనసాగాలంటూ బైడెన్‌ వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది.