1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 25 ఆగస్టు 2021 (16:02 IST)

తాలిబన్లు తొక్కేశారు, పంజ్‌షేర్ మసూద్ పని అయిపోయింది...

ఆఫ్ఘనిస్తాన్ దేశంలో అన్ని ప్రాంతాలను కైవసం చేసుకున్న తాలిబన్లకు పంజ్‌షేర్ ప్రాంతం ఒక్కటే కొరకరాని కొయ్యలా మారింది. హిందూకుష్ పర్వత సాణువుల్లో శుత్రుదుర్భేద్యంగా వుండే ఈ ప్రాంతం కాబూల్‌కి ఉత్తరాన 150 కిలోమీటర్ల దూరంలో వుంటుంది. ఈ ప్రాంతాన్ని జయించడానికి గతంలో అంటే.. 1980ల్లో సోవియట్ సేనలు, 1990లో తాలిబన్ల సాధ్యం కాలేదు.
 
పంజ్‌షేర్ సింహం అనే పేరు గడించిన అహ్మద్ షా మసూద్ ఈ ఫ్రావిన్స్ నుంచి ప్రాతినిధ్య వహించి శత్రువులను లోనికి రాకుండా అడ్డుకున్నాడు. ఐతే ఆయన కుమారు మసూద్ ఇప్పుడు చేతులు ఎత్తేసినట్లు వార్తలు వస్తున్నాయి. అప్పటి బలం వేరు ఇప్పుడున్న పరిస్థితి వేరు అంటున్నారట ఆయన సన్నిహితుడు. పైగా అమెరికా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్ తదితర దేశాల నుంచి సాయం అర్థించినా ఎవ్వరూ స్పందించడంలేదట. దీనితో లొంగిపోవడమే మంచిదనే అభిప్రాయంలో వున్నారట.
 
తాలిబన్లు బాగా బలం పుంజుకున్నారనీ, వారితో రాజీ కుదుర్చుకోవడం మంచిదనే అభిప్రాయంలో వున్నారట మసూద్. ఇప్పటికే తాలిబన్లు పంజ్‌షేర్ చుట్టూ పెద్దసంఖ్యలో చేరిపోయారనీ, ఏ క్షణమైనా మారణహోమం సృష్టించే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. రక్తపాతం జరగకుండా వారితో అవగాహన కుదుర్చుకోవాలని మసూద్ ఆలోచన చేస్తున్నారట. ఐతే తాలిబన్లు మసూద్ దొరికితే విడిచిపెడతారా అనే వార్తలు వస్తున్నాయి.