1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 19 ఆగస్టు 2021 (19:20 IST)

తాలిబన్లకు చుక్కలు చూపించిన హీరో.. ఆయన ఎవరో తెలుసా?

తాలిబన్లకు చుక్కలు చూపించే ఓ హీరో వున్నారు. హిందూకుష్ పర్వత శ్రేణులకు సమీపంలో కాబుల్‌కు ఉత్తరాన 150 కిలోమీటర్ల దూరంలో పంజ్‌షిర్ ప్రావిన్స్ వుంది. ఆ ప్రాంతానికి చెందిన ఓ నేత పేరు వింటేనే తాలిబన్లు వణుకు పుడుతోంది. 
 
ఇప్పుడు ఆ ప్రాంతమే ఆఫ్గాన్ రాజకీయ వ్యూహాలకు కేంద్ర బిందువుగా మారింది. తాలిబన్ల దురాక్రమణపై సింహంలా గర్జిస్తున్న ఆ ప్రాంతమే పంజ్‌షిర్. ఆ నాయకుడే ఒకప్పుడు అక్కడ గెరిల్లా పోరాటంలో కీలకంగా వ్యవహరించారు. అతని పేరు అహ్మద్ షా. 
 
అసలు తాలిబన్లకు తలవంచని పంజ్‌షిర్ స్పెషాలిటీ గురించి తెలుసుకుందాం. కొన్ని శతాబ్ధాల కాలంగా పంజ్‌షిర్ విదేశీ బలగాలు కానీ, ఇటు తాలిబన్లు కానీ కాలు పెట్టలేకపోయాయి. పంజ్‌షిర్ పేరుకు తగినట్లు అక్కడి ప్రజల్లో తెగింపు ఎక్కువ. 
 
తాలిబన్ల పాలనను తుదిముట్టించడంలోనూ ఈ ప్రాంతానిదే కీలక పాత్ర. అలాగే తాలిబన్ వ్యతిరేక నాయకుడు అహ్మద్ షా మసూద్. ఆయన తాలిబన్ల అంతానికి అహర్నిశలు కృషి చేసారు. 1970-80లలో సోవియట్ రష్యా దండయాత్రను తిప్పికొట్టడంలో పాటు 1996-2001లో తాలిబన్ల రాక్షస పాలనపై అవిశ్రాంత  పోరాటం చేసిన యోధుల్లో కీలక పాత్ర ఇతనిదే.