సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 23 ఆగస్టు 2021 (11:53 IST)

ఆప్ఘనిస్థాన్ క్రికెట్‌కు మద్దతు ప్రకటించిన తాలిబన్ తీవ్రవాదులు

తాలిబన్ల చెరలోకి ఆప్ఘనిస్థాన్ దేశం వెళ్లిపోయింది. దీంతో ఆ దేశ క్రికెట్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే ఎవరూ ఊహించని విధంగా తాలిబన్లు ఆ దేశ క్రికెట్‌కు సంపూర్ణ మద్దతును ప్రకటించారు. 
 
తాజాగా, తాలిబన్ నాయకుడు అనీస్ హక్కానీ ఆప్ఘనిస్థాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది, మాజీ క్రికెట్ బోర్డు అధికారులు అసదుల్లా, నూర్ అలీ జద్రాన్‌లతో సమావేశం సందర్భంగా ఆ దేశ క్రికెటర్లకు భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. 
 
"మీ వెంట మేమున్నాం.. చెలరేగి ఆడండి" అంటూ క్రికెటర్లను ఉత్సాహపరిచి, మద్దతు ఇచ్చినట్లు సమాచారం. త్వరలో యూఏఈ వేదికగా  జరగబోయే టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు ఆప్ఘన్ జట్టుకు లైన్‌ క్లియర్‌ అయినట్టేనని క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.