గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 27 ఆగస్టు 2021 (18:15 IST)

నేనేగానీ అమెరికా అధ్యక్షుడిగా ఉండివుంటేనా... డోనాల్డ్ ట్రంప్

ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ విమానాశ్రయంలో ఐఎస్ ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. ఈ దాడిలో దాదాపు వంద మందివరకు మృత్యువాతపడ్డారు. అలాగే, మున్ముందు కూడా ఆప్ఘాన్‌లో మరిన్ని దాడులు జరగవొచ్చని అమెరికా టాప్ నిఘా సంస్థ హెచ్చరించింది. 
 
ఈ దాడులపై అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, తాను అధ్య‌క్షుడిగా ఉండి ఉంటే అస‌లు ఈ కాబూల్ దాడులు జ‌రిగేవే కావ‌న్నారు. "ఒక‌వేళ నేను మీ అధ్య‌క్షుడిగా ఉండి ఉంటే ఈ విషాదం ఎప్ప‌టికీ జ‌రిగి ఉండేది కాదు. ఎప్ప‌టికీ జ‌రిగేది కాదు. ఇలాంటిది అస‌లు జ‌ర‌గ‌దు" అని ట్రంప్ అన్నారు. 
 
కాగా, గురువారం జ‌రిగిన రెండు ఆత్మాహుతి దాడుల్లో 100 మందికిపైగా మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే. మృతుల్లో 13 మంది అమెరికా సైనికులు కూడా ఉన్నారు. ఈ దారుణానికి పాల్ప‌డిన వాళ్ల‌పై ప్రతీకారం తీర్చుకుంటామ‌ని ఇప్ప‌టికే అధ్య‌క్షుడు జో బైడెన్ చెప్పిన విష‌యం తెలిసిందే.