1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Dharmareddy takes over as TTD EO in-charge

టీటీడీ ఇంచార్జ్‌ ఈవోగా ధర్మారెడ్డి భాధ్యతలు స్వీకరణ

Dharmareddy
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవోగా ఉన్న అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బదిలీ చేసిన విషయం తెలిసిందే.  అయితే.. ఏపీ వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా సింఘాల్‌ను నియమించింది సర్కార్.

సుదీర్ఘకాలంపాటు టీటీడీ ఈవోగా కొనసాగారు అనిల్ కుమార్ సింఘాల్.. కొద్దిరోజుల్లోనే మరో అధికారిని టీటీడీ ఈవోగా నియమించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టీటీడీ ఇంచార్జ్‌ ఈవోగా ధర్మారెడ్డి ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. 

అదనపు ఈవోగా ఉన్న ధర్మారెడ్డికి టీటీడీ ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. అయితే అతన్ని తాత్కాలికంగానే నియమించారు.

అటు జవహర్‌రెడ్డి గత కొంతకాలంగా తనను టీటీడీ ఈవోగా నియమించాలని అడుగుతున్నట్లు సమాచారం. ఇక సోమవారం వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు. 
తర్వాతి కథనం
కటకటాల్లోకి కంజరభట్ల గ్యాంగ్.. సెల్ఫోన్ కంటైయినర్ కేసును చేధించిన పోలీసులు