1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. EC to not allow volunteers into election activities

వైకాపా సర్కారుకు షాక్.. వాలంటీర్లను కాస్త పక్కనబెట్టండి..

election evm
ఏపీలోని వైకాపా సర్కారుకు షాక్ తప్పలేదు. సీఎం జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్ల వ్యవస్థను ప్రస్తుతం పక్కనబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఏపీలో వాలంటీర్ల ద్వారానే.. అన్ని పనులు కొనసాగుతున్నాయి. 
 
50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ను నియమించడంతో.. ఏం జరిగినా వారి కనుసన్నలోనే సాగుతోంది. ఈ నేపథ్యంలో సర్కార్‌కు షాక్ ఇచ్చింది ఎన్నికల సంఘం. ఈ మేరకు చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ ఎం.కె. మీనా కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల కార్యక్రమాలకు వాలంటీర్లను దూరంగా ఉంచాలని స్పష్టం చేశారు.  
 
ముఖ్యంగా ఓటర్ల నమోదులో వాలంటీర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించవద్దన్నారు. ఓటర్-ఆధార్ అనుసంధానంలోనూ వాలంటీర్లను వినియోగించ వద్దని స్పష్టం చేశారు. అలాగే అభ్యర్థులకు వాలంటీర్లు ఏజెంట్లుగా ఉండకూడదని స్పష్టం చేశారు. 
తర్వాతి కథనం
రూ.3లక్షలకు బాలికను అమ్మేశారు.. గర్భం దాల్చలేదని టార్చెర్