1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. EVM Case: YCP MLA Pinneli Rama Krishna Reddy Arrested

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్

pinnelli ramakrishna reddy
ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్‌లోని గెస్ట్ హౌజ్‌లో పిన్నెల్లిని అదుపులోకి తీసుకున్నారని ఆయనను ఏపీకి తీసుకువెళ్లేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తోంది. కాగా, పిన్నెల్లి అరెస్ట్‌ను పోలీసులు ధృవీకరించాల్సి ఉంది. 
 
బుధవారం సాయంత్రంలోగా పిన్నెల్లిని అరెస్ట్ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించడంతో సీరియస్‌గా తీసుకున్న ఈసీ, పోలీసులను అలర్ట్ చేసింది. పిన్నెల్లి హైదరాబాద్‌లో ఉన్నట్లు అనుమానించిన పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. 
 
ఈ క్రమంలోనే హైద‌రాబాద్ శివారులో పిన్నెల్లి డ్రైవ‌ర్ పోలీసుల నుండి త‌ప్పించుకున్నార‌ని సమాచారంతో పోలీసులు ఆ మార్గాల్లో తనిఖీలను ముమ్మరం చేశారు. ఇంకా ఆయన విదేశాలకు పారిపోయారని కూడా వార్తలు వచ్చాయి. చివరికి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
About Writer
సెల్వి
తర్వాతి కథనం
ఇనార్బిట్ మాల్ సైబరాబాద్‌లో అలరిస్తున్న ఫిల్తీ లూకర్స్ ఆర్ట్ ఇన్‌స్టాలేషన్, పైరేట్ బోట్స్