1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Ex-CS IYR Krishna Rao slams on Amaravathi Capital constructions

రాజధాని అంటే సినిమా సెట్టింగ్ కాదు.. : ఐవైఆర్ కృష్ణారావు ఫైర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఎండీ ఐవైఆర్ కృష్ణారావు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరిపై మండిపడ్డారు. ముఖ్యంగా రాజధాని అమరావతి నిర్మాణంపై ఆయన విమర్శలు గ

Ex-CS IYR Krishna Rao
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఎండీ ఐవైఆర్ కృష్ణారావు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరిపై మండిపడ్డారు. ముఖ్యంగా రాజధాని అమరావతి నిర్మాణంపై ఆయన విమర్శలు గుప్పించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, రాజధాని నిర్మాణంలో ముఖ్యమంత్రి చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. స్విస్ ఛాలెంజ్ విధానం చాలా లోపభూయిష్టంగా ఉందని... సరైన ప్లానింగ్ లేకపోవడం వల్లే రాజధాని నిర్మాణంలో అనేక అవాంతరాలు ఎదురవుతున్నాయని వ్యాఖ్యానించారు. 
 
రాజధాని అంటే సినిమా సెట్టింగ్ కాదని... రాజధాని నిర్మాణానికి సినిమా దర్శకులు ఎందుకని ఎద్దేవా చేశారు. అమరావతి నిర్మాణంలో ఇబ్బందులు వస్తే ప్రజలే నష్టపోతారని... వారి జీవితాలు నాశనమవుతాయన్నారు. ప్రజలకు ఏదీ అవసరమో తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన హితవు పలికారు. 
About Writer
pnr
తర్వాతి కథనం
తిరుపతిలో చిరుత కలకలం.. కుక్కను చంపి...