1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. fire accident on second floor at nellore district gudur

గూడూరులో పై అంత‌స్తులో పొగ‌లు... గ‌గ్గోలు పెట్టిన య‌జ‌మాని

fire accident
నెల్లూరు జిల్లా గూడూరులో ఒక ఇంటి పై అంత‌స్తులో అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. గూడూరు కుమ్మర వీధిలో ఒక ఇంటిలో పై అంతస్థులో పొగరావడంతో ఆందోళన లో యజమానులు హాహాకారాలు చేశారు. ఇంత‌లోనే ఫైర్ ఇంజన్ రంగ ప్రవేశం చేసింది. కానా, అది అతి ఇరుకైనా సందు కావ‌డం వల్ల పొగని ఆర్పేందుకు  ఫైర్ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 
 
రెండో అంత‌స్తులో షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. ఇళ్ళు మొత్తం సెంట్రల్ ఏసీ, విలువైన ఫర్నిచర్ ఉండడంతో ఆందోళనలో ఇంటి యజమాని గ‌గ్గోలుపెట్టాడు. గూడూరు కుమ్మర వీదిలి ఒక విలాసవంతమైన భవనంలో పైఅంతస్థులో పొగలు రావడంతో భయాందోళనకు గురైన యజమానులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది పైఅంతస్థులో పొగని కంట్రోల్ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. లోప‌ల ఎంత నష్టం జరిగింది ఎలా జరిగింది అనే విషయాలు తెలియాల్సి ఉంది.
 
 
అయితే, నిబంధనలు విరుద్ధంగా క‌ట్టిన ఇలాంటి భవన నిర్మాణాలతో పెనుముప్పు పొంచి ఉంది. గూడూరు లో ఫైర్  నిబంధనలు పాటించకుండా, నిబంధనలకు విరుద్ధంగా అనేక భవనాలు నిర్మాణం పూర్తి చేసుకున్నారు. కొన్ని ఇంకా నిర్మాణంలో ఉన్నాయి. ఇలాంటి భవనాలు వల్ల భవిష్యత్తులో ఏదైనా అగ్నిప్రమాదం సంభవిస్తే. తీవ్ర నష్టాలు చవి చూసే ప్రమాదం ఉంది. అధికారులు సంఘటన జరిగినప్పుడు కాకుండా, ముందుగా ఇలాంటి అక్రమ భవనాల నిర్మాణం అడ్డుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
About Writer
జెఎస్కే
తర్వాతి కథనం
ఎయిడెడ్ స్కూల్స్ విలీనంపై జగన్ సర్కారు వెనక్కి!