ధూలేలో ఘోర రోడ్డు ప్రమాదం : ముగ్గురు మృతి
మహారాష్ట్రలోని ధూలేలో బుధవారం రాత్రి ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఏడెనిమిది వాహనాలు ఒకేసారి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, గాయపడ్డ వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
మరోవైపు, తెలంగాణా రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని షాంపూర్ వద్ద ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.