1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్

అట్టుడుకుతున్న పాకిస్థాన్ : ఇమ్రాన్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు

పాకిస్థాన్ దేశం అట్టుడికిపోతోంది. ఆ దేశ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్రతరమవుతున్నాయి. ఆయన గద్దె దిగాలంటూ దేశ వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లెక్కి నిరసనకు దిగుతున్నారు. దేశాన్ని సర్వనాశనం చేస్తున్న ఇమ్రాన్ వెంటనే గద్దె దిగాలని డిమాండ్ చేస్తున్నారు. 
 
దీనికి కారణం పాకిస్థాన్ దేశంలో గతంలో ఎన్నడూ లేనంతగా నిత్యావసరాల ధరలు అమాంతం పెరిగిపోవడమే. పెరుగుతున్న ధరలు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రతిపక్షాలు, కార్మికులు, ప్రజలు వేలాది మంది కరాచీలో రోడ్లపైకి వచ్చి ర్యాలీలు చేస్తున్నారు. 
 
ప్రధాని తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అమాంతం పెరిగిపోయిన ధరలతో పేదలు కడుపునిండా తినలేని పరిస్థితి దాపురించిందని కార్మిక సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. 
 
దేశాన్ని ఎలా నడపాలో ఇమ్రాన్‌ఖాన్‌కు తెలియదని, ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని జమీయత్ ఉలేమా-ఇ-ఇస్లాం సంస్థ నేత రషీద్ సుమ్రో డిమాండ్ చేశారు.