గురువారం, 9 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 24 అక్టోబరు 2021 (19:33 IST)

ఐసీసీ ట్వంటీ20 వరల్డ్ కప్ : టాస్ గెలిచిన పాకిస్థాన్.. బ్యాటింగ్???

దుబాయ్ వేదికగా ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా ఆదివారం రాత్రి భారత్, పాకిస్థాన్ క్రికెట్ జట్ల కీలక పోరు జరుగనుంది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు తొలుత టాస్ గెలిచి మరోమాటకు తావులేకుండా భారత్‌కు బ్యాటింగ్ అప్పగించింది. 
 
ఈ సందర్భంగా పాక్ కెప్టెన్ బాబర్ మాట్లాడుతూ, తమ బౌలర్లకు ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టడం తెలుసని అన్నాడు. అలాగే, తమ బ్యాటింగ్ సామర్థ్యంపై పూర్తి నమ్మకం ఉందన్నాడు. 
 
అలాగే, భారత కెప్టెన్ కోహ్లీ స్పందిస్తూ, వీలైనంత ఎక్కువ లక్ష్యాన్ని నిర్దేశించేందుకు ప్రయత్నిస్తామని చెప్పాడు. తాము టాస్ గెలిచినా తొలుత బౌలింగే ఎంచుకునే వారమన్నాడు. 
 
అయితే, టాస్‌పై ఎవరికీ నియంత్రణ ఉండదని చెప్పాడు. ఈ మ్యాచ్‌లో రాహుల్ చాహర్, ఇషాన్ కిషన్, అశ్విన్, ఠాకూర్ ఆడడం లేదని వెల్లడించారు. 
 
భారత జట్టు ఇదే...
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, జస్ర్పీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.
 
పాకిస్థాన్ జట్టు ఇదే...
బాబర్ అజామ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్, ఫకార్ జమాన్, మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, ఆసిఫ్ అలీ, ఇమాద్ వాసిం, షాదాబ్ ఖాన్, హసన్ అలీ, హరీస్ రవూఫ్, షహీన్ అఫ్రిది.
 
కాగా, వరల్డ్ కప్‌లలో పాకిస్థాన్‌పై టీమిండియాకు అద్భుతమైన రికార్డు ఉంది. ఈ రెండు జట్లు ఐసీసీ వరల్డ్ కప్‌లలో 12 సార్లు తలపడగా, అన్నింటా భారత్‌నే విజయం వరించింది. టీ20 వరల్డ్ కప్‌లలో ఇరుజట్లు ఐదు పర్యాయాలు తలపడగా, పాకిస్థాన్ ఒక్కసారి కూడా గెలవలేకపోయింది.