బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 31 అక్టోబరు 2021 (12:41 IST)

డెహ్రాడూన్ జిల్లాలో ఘోర ప్రమాదం.. 11 మంది మృతి

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ జిల్లాలోని వికాస్‌నగర్‌ వద్ద ఓ వాహనం అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఈ వాహనంలో ప్రయాణిస్తున్న 11 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. 
 
ఈ ప్రమాద వార్త తెలియగానే పోలీసులు, ఎస్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నది. ఆదివారం ఉదయం ఈ ప్రమాదం సంభవించింది.